LIVE

పెద్ది విడుదల పై రామ్‌చరణ్‌ క్లారిటీ

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే మార్చి 26న రిలీజ్ కావలసిన ఈ సినిమాని ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు. అయినప్పటికీ ఈ మూవీ మరోసారి పోస్ట్ పోన్ కానుందని, జూన్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై తాజాగా చరణ్ క్లారిటీ ఇచ్చారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన రాకాస సినిమా మూవీ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ కూడా భాగమయ్యారు. సినిమాకు సపోర్ట్‌గా చిత్ర బృందంతో కలిసి ఓ స్పెషల్ ప్రమోషనల్‌ వీడియో చేశారు. ‘పెద్ది లేట్‌ అవడం లేదని కొంచెం ప్రమోట్‌ చేయండి.. వాయిదా అని బయట బాగా వింటున్నాను’ అంటూ ‘రాకాస’ టీమ్‌తో చెర్రీ అన్నారు. దీంతో పెద్ది సినిమా వాయిదా పడటం లేదని క్లారిటీ వచ్చేసింది.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు